తమిళ స్టార్ హీరో విజయ్ తన భార్య సంగీతతో విడిపోతున్నాడని, త్వరలోనే వీళ్లు విడాకులు తీసుకోనున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతోన్న విషయం విదితమే. ఈ రూమర్స్ కి బలం చేకూర్చేలా విజయ్ కు సంబంధించిన ఏ కార్యక్రమాల్లోనూ సంగీత ఎక్కడా కనిపించడం లేదు. 22 ఏళ్ల తమ వివాహ బంధాన్ని విజయ్ తెగదెంపులు చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి కారణం కీర్తి సురేష్ అంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
గత కొంతకాలంగా విజయ్ కి, కీర్తి సురేష్ కి మధ్య ప్రేమాయణం సాగుతోందని, ఈ క్రమంలోనే విజయ్ విడాకులకి సిద్ధం అయ్యాడని టాక్ వినిపిస్తోంది. విజయ్, కీర్తి కలిసి ఏజెంట్ బైరవ, సర్కార్ వంటి సినిమాల్లో నటించారు. ఆ సినిమాల షూటింగ్ సమయం నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహ సంబంధం ఏర్పడిందని.. ఆబంధమే వీరి మధ్య ప్రేమగా మారిందని అంటున్నారు.
విజయ్ భార్య సంగీత ఈ విషయంపై ఎన్నిసార్లు వివరణ అడిగిన దళపతి చెప్పకుండా తన పని తాను చేసుకుంటూ కీర్తితో క్లోజ్ గా ఉంటున్నాడని తమిళ మీడియాలో ఎన్నో రకాల వార్తలు కూడా వచ్చాయి. తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకుంటాడనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే న్యాయం జరగాలంటూ #justiceforsangeetha అనే హ్యాష్ ట్యాగ్ ను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. అలాగే కీర్తి సురేష్ ని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలీదు కానీ.. కోలీవుడ్ లో మాత్రం ఈ ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే మరోవైపు కొంతమంది విజయ్ ఫ్యాన్స్ ఈ విషయంలోకి కీర్తి సురేష్ ని అనవసరంగా లాగుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చేంతవరకు ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి.