పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందించడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చి పెడుతున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడాడు తమన్. భీమ్లానాయక్ సినిమాను పవన్ కల్యాణ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా చెప్పుకొచ్చాడు.
రీ-రికార్డింగ్ లో భాగంగా త్రివిక్రమ్ తో కలిసి భీమ్లానాయక్ సినిమా చూశాడట తమన్. పవన్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని, సినిమా చూసిన తర్వాత తన ఫస్ట్ ఫీలింగ్ ఇదేనని అన్నాడు. ఇక పాటలపై స్పందిస్తూ.. భీమ్లానాయక్ పాటలకు మంచి రెస్పాన్స్ రావడంపై హ్యాపీ ఫీలయ్యాడు. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ ఈ సినిమాలో ఓ పాట రాయడం, దానికి తను స్వరాలు సమకూర్చడం జీవితంలో మరిచిపోలేనంటున్నాడు.
భీమ్లానాయక్ సినిమా ప్రీ-ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు పరుగులు పెడుతుందట. ఓవైపు రానా, మరోవైపు పవన్ కల్యాణ్.. తమ పెర్ఫార్మెన్స్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లారని చెబుతున్నాడు తమన్. ఇక తన వర్క్ గురించి స్పందిస్తూ.. భీమ్లానాయక్ కు ది బెస్ట్ ఇచ్చానని, ఇంకా టైమ్ దొరకడంతో మరింత మంచి ఔట్ పుట్ ఇస్తానంటున్నాడు.