ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు పెట్టింది పేరుగా మారాడు తమన్. సినిమాలకు తమన్ అందించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. చాలామంది ఆ స్కోర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అఖండ బీజీఎం అదరగొట్టాడు తమన్. ఇప్పుడు వీరసింహారెడ్డి కూడా అదే రేంజ్ లో ఉంటుందని చెబుతున్నాడు.
“అఖండలో స్పీకర్లు పగిలిపోయాయి. వీరసింహా రెడ్డి లో కూడా స్పీకర్లు పగులుతాయి. జాగ్రత్త అని ముందే చెప్పాను. బాలకృష్ణ గారిని చూస్తేనే ఎక్కువ వాయించేయాలి అనిపిస్తుంది. నన్ను ఏం చేయమంటారు (నవ్వుతూ). బాలయ్య గారి కటౌట్ ఎక్కువ మ్యూజిక్ అడుగుతుంది. నేనేం చేయలేను. ఈసారి బాక్సులు పగలాల్సిందే.”
ఇలా బీజీఎం విషయంలో తగ్గేదేలే అంటున్నాడు తమన్. ఈరోజు థియేటర్లలోకి వచ్చింది వీరసింహారెడ్డి సినిమా. తమన్ ఓ రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది వీరసింహారెడ్డి. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కింది వీరసింహారెడ్డి.