బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ చిత్రం ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయం లో కీలక పాత్ర తమన్ దే నాని చెబుతున్నారు సినీ ప్రేక్షకులు. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించారని చెబుతున్నారు. బాలయ్య బాబు యాక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే మరోవైపు తమన్ కుగుడి కట్టినా తప్పు లేదు అంటూ మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఇది బాలయ్య బాబు అఖండ కాదు తమన్ అఖండ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమన్ కు సంబంధించిన అఖండ గెటప్ ఇమేజెస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.