మ్యూజిక్ డైరెక్టర్ థమన్…ఈ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ట్రెండ్. ఇటీవల వచ్చిన అలవైకుంఠపురములో మ్యూజికల్ హిట్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు అదిరిపోయే మ్యూజిక్ అందించిన థమన్ ప్రస్తుతం చాలా బిజీ గా గడుపుతున్నారు. ఎంత బిజీ అంటే తమన్ చేతిలో అరడజను సినిమాలు ఉన్నానంటేనే అర్ధం అవుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ పింక్ రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీ గా ఉన్నాడు తమన్.
ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ పవన్ కళ్యాణ్ సినిమా కోసం శక్తి వంచన లేకుండా బెస్ట్ ట్యూన్స్ ఇస్తానంటూ ట్వీట్ చేశాడు. థమన్ ట్వీట్ కు పవన్ ఫాన్స్ థమన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
వేణు శ్రీరామ్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. మే 15 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.