గాడ్ ఫాదర్ సక్సెస్ తో తమన్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. మరీ ముఖ్యంగా చిరంజీవి తర్వాత తనకు ఎక్కువగా ప్రశంసలు దక్కడంతో, తమన్ ఆనందానికి హద్దుల్లేవ్. అయితే ప్రేక్షకుల నుంచి ఎన్ని ప్రశంసలు వచ్చినప్పటికీ, చిరంజీవి నుంచి తను అందుకున్నదే ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నాడు ఈ సంగీత దర్శకుడు.
“చిరంజీవి గారు ఇచ్చిన కాంప్లీమెంట్స్ మర్చిపోలేను. దర్శకుడు శంకర్ గారు ఫోన్ చేసి అభినందించారు. మణిశర్మ, కోటి గారు కూడా ఫోన్ చేశారు. అలాగే చాలా మంది మెగా అభిమానులు ఫోన్ చేసి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. మా మ్యూజిక్ టీమ్ చిరంజీవి గారితో కలసి ఈ సినిమాని చూశాం. చిరంజీవి గారు నన్ను ఎంతో ప్రేమగా కౌగలించుకున్నారు. చాలా గ్రేట్ ఫీలింగ్. మరో కమర్షియల్ సినిమా చేద్దామని ఆయన్ని అడిగాను. తప్పకుండా చేద్దామని మాటిచ్చారు. మెగాస్టార్ గారు గ్రేట్ లెజండ్. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ ని. చాలా అనందంగా ఉంది. గాడ్ ఫాదర్ విజయం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.”
ఇలా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు తమన్. మర్రి చెట్టుకు ఎన్ని నీళ్లు పోసినా సరిపోదని.. అలాగే మెగాస్టార్ లాంటి మహావృక్షం నటించిన సినిమాకు ఎంత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసినా సరిపోదని, ఆయన క్రేజ్ కు తగ్గట్టు ఆర్ఆర్ ఇవ్వడం చాలా కష్టమని అంటున్నాడు తమన్.