అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ యేడాది ఆరంభంలో వచ్చిన సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి ప్రధాన కారణం మ్యూజిక్. ఈ సినిమాకు థమన్ అదిరిపోయే మ్యూజిక్ ని అందించాడు. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ యూట్యూబ్ లో పలు రికార్డులను కొల్లగొట్టింది. అయితే అల్లుఅర్జున్ అభిమానుల కోసం థమన్ ఈ సినిమాను నుంచి మరో సర్ ప్రైజ్ ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా తానే ప్రకటించారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను త్వరలోనే అభిమానుల కోరిక మేరకు విడుదల చేస్తున్నట్లు, దీంతో మరికొన్ని ట్రాక్స్‌ను కూడా యాడ్ చేస్తున్నట్లు థమన్ ప్రకటించారు.
We are adding Some additional tracks also for #avplbgm OST !!
Very Soon to ur ears 🥁💪🏼♥️ pic.twitter.com/dQPqJgo0j1— thaman S (@MusicThaman) September 14, 2020