బన్నీ ఫ్యాన్స్ కి థమన్ స్పెషల్ మెసేజ్ - Tolivelugu

బన్నీ ఫ్యాన్స్ కి థమన్ స్పెషల్ మెసేజ్

thaman special treat to allu arjun fans over samajavaragamana song, బన్నీ ఫ్యాన్స్ కి థమన్ స్పెషల్ మెసేజ్

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫెయిల్యూర్‌తో లాంగ్ గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్‌ మార్క్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, ఎస్‌. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సినిమా అంచనాలను భారీగా పెంచేస్తున్నారు. టీజర్‌తో పాటు సామజవరగమన, రాములో రాములా పాటకు సూపర్బ్ రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా సామజవరగమన పాటను ఇప్పటికే 73 లక్షలపైగా వ్యూస్‌ సాధించి సౌత్‌లో అత్యధిక మంది చూసిన పాట రికార్డ్‌ సృష్టించింది. ప్రస్తుతం అన్ని ప్లాట్‌ ఫామ్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఈ పాట చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది. సినిమాతో పాటు ప్రత్యేకంగా ఈ పాట మీద కూడా భారీ అంచనాలు ఉండటంతో అందుకు తగ్గట్టుగా పాటను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సాంగ్ షూట్ కోసం హీరో హీరోయిన్లతో పాటు చిత్రయూనిట్‌ పారిస్‌ వెళ్లారు.

శేఖర్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్న ఈ సాంగ్ గురించి థమన్ ట్వీట్ చేస్తూ సామాజవరగమన ఆన్ ది వే అంటూ పోస్ట్ చేశాడు. దీని బట్టి చూస్తుంటే సూపర్ హిట్ అయిన లిరికల్ సాంగ్ కి వీడియో వెర్షన్ త్వరలోనే రిలీస్ చేయబోతున్నటు అర్ధమవుతుంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp