ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి రమణ లోడ్ ఎత్తాలి రా అంటూ ఓ ఫైట్ సీన్ ను అచ్చం సినిమా లో చేసినట్టే షూట్ చేసి కొంతమంది చిచ్చర పిడుగులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోని స్వయంగా దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదిక ట్యాగ్ చేసి ప్రశంసలు కురిపించారు.
తాజాగా మరికొంతమంది చిచ్చర పిడుగులు అల వైకుంఠపురం లోని ఓ ఫైట్ సీన్ షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ వీడియోను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేశారు. అంతే కాదు కుమ్మేశారు అంటూ రాసుకొచ్చాడు. ఈ వీడియోని ఇప్పుడే మా అల వైకుంఠపురములో చిత్ర టీమ్ మొత్తానికి సెండ్ చేశాను.. అని పేర్కొన్నారు.
Kummeeeesaarruuu !! Jus sent this to our whole #AVPL Team 🥁🥁🥁🥁🥁 https://t.co/RVO7n7n9ng
— thaman S (@MusicThaman) September 17, 2020