ప్రతి సంవత్సరం లానే సంవత్సరం ఎండింగ్ వచ్చేసరికి ఆ సంవత్సరంలో లో జరిగిన కొన్ని విషయాలను ఆయా సంస్థలు బయట పెడుతూ ఉంటాయి. అయితే 2020 లో కరోనా దెబ్బకు మొత్తం ప్రపంచం స్తంభించిపోయింది. ఇక ఇంకొన్ని రోజులలో 2020 ముగిసిపోతుంది. కొత్తగా 2021 లోకి అడుగు పెట్టబోతున్నాము. ఈనేపథ్యంలోనే ట్విట్టర్ ఒక్కో లెక్కలను బయట పెడుతుంది. ఈ ఏడాది ఏ హీరో పేరు ట్రెండ్ అయింది. ఏ సినిమా పేరు టాప్ ప్లేస్లో ఉంది…అనే వివరాలను తాజాగా ట్విట్టర్ విడుదల చేసింది .
అయితే అందులో తెలుగు విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం వకీల్ సాబ్ మొదటి స్థానంలో నిలిచింది. మోస్ట్ ట్వీటెడ్ తెలుగు మూవీ ఇన్ 2020 గా వకీల్ సాబ్ చిత్రం నిలిచింది. అందుకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ట్విట్టర్ ఇండియా ప్రకటించింది. ఒక మోషన్ పోస్టర్, ఒక పాట మాత్రమే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలయ్యాయి. ఈ రెండింటి తోనే ట్విట్టర్ లో టాప్ ప్లేస్ ను సంపాదించడం పట్ల పవన్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.
Powerstar @PawanKalyan’s #VakeelSaab is the #MostTweetedTeluguMovie of 2020!
It will be in 2021 AlSO!! 💥💥🧨🧨🏆🎵📢❤️
Mark my words dear #powerstar FANS
This is Gonna be HUGE 🥰📢📢
The POWER Will Strike SooN🔥
My love & respect to our leader ♥️ Shri @PawanKalyan gaaru pic.twitter.com/Y6zkSwZRLI
— thaman S (@MusicThaman) December 14, 2020
Advertisements