పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.ఇకపోతే సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావటంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ చేశారు. హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ అంటూ ట్రెండింగ్ సృష్టిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ నుంచి ఏదో ఒక అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
దానికి ఆద్యం పోస్తూ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ బుధవారం అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. కానీ ఆ రోజు ఏం రిలీజ్ చేస్తున్నారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అభిమానులు మాత్రం వకీల్ సాబ్ నుంచి టీజర్ వస్తే బాగుంటుందని భావిస్తున్నారు.
WED – NES – DAY !! ❤️
— thaman S (@MusicThaman) August 28, 2020