దళపతి విజయ్ అంటే తమిళనాడులోనే కాదు తెలుగులోనూ ఎంతో అభిమానం. ఓవైపు తమిళ హీరోలంతా టాలీవుడ్ లో తమ హోల్డ్ కోల్పోతున్న సమయంలోనూ విజయ్ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. విజయ్ తో తమిళ్-తెలుగు భాషల్లో ఓ బైలింగ్వల్ సినిమా చేయబోతున్నాడు. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే విజయ్ తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగులో టాప్ హీరోలందరితోనూ సినిమా చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, 2022లో సల్మాన్ ఖాన్ తోనూ ఓ సినిమా చేయబోతుంది. ఇప్పుడు విజయ్ కు ఏకంగా 10కోట్ల భారీ అడ్వాన్స్ పే చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ కాకుండా… తెలుగు డైరెక్టర్ నే రంగంలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సరైన కథ, దర్శకుడి కోసం సర్చింగ్ కొనసాగుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ చక్కర్లు కొడుతుంది.