నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా ఆడదనే విషయం, రిలీజైన మొదటి రోజే ఇటు ఆడియన్స్ కు, అటు నిర్మాత దిల్ రాజుకు అర్థమైపోయింది. అందుకే రెండో రోజు నుంచే ప్రమోషన్ ఆపేశారు. ప్రేక్షకులు కూడా థియేటర్లకు రావడం ఆపేశారు. అలా నాగచైతన్య కెరీర్ తో పాటు, దిల్ రాజు కెరీర్ లో కూడా డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు క్లోజ్ అయింది. ప్రస్తుతం కొన్ని థియేటర్లలో కొనసాగుతున్నప్పటికీ, వసూళ్లపై ప్రభావం చూపించేంత స్థాయిలో ఈ సినిమాకు ఆక్యుపెన్సీ లేదు. ఇక లెక్కల విషయానికొస్తే.. ఫైనల్ రన్ లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 3 కోట్ల 35 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది.
వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 4 కోట్ల 45 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అటు ప్రీ-రిలీజ్ బిజినెస్ చూస్తే 25 కోట్ల రూపాయలుంది. అంటే.. అటుఇటుగా బయ్యర్లు 20 కోట్లు నష్టపోయారన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో థాంక్యూ సినిమాకు వచ్చిన క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి
నైజాం – 1.24 కోట్ల
సీడెడ్ – 38 లక్షలు
ఉత్తరాంధ్ర – 66 లక్షలు
ఈస్ట్ – 30 లక్షలు
వెస్ట్ – 17 లక్షలు
గుంటూరు – 23 లక్షలు
కృష్ణా – 25 లక్షలు
నెల్లూరు – 12 లక్షలు