అక్కినేని నాగచైతన్య తాజాగా.. మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న థ్యాంక్యూ చిత్రం.. జులై 8న విడుదల చేయాలని తొలుత సినీ మేకర్స్ నిర్ఱయించారు. ‘మనం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో నాగ్ సరసన రాశీ ఖన్నా, మాళవిక నాయర్ లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే.. సినిమా రిలీజ్ డేట్ కూడా ఖరారు కావడంతో.. దానికి తగ్గట్టు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. కాగా.. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో కాస్త జాప్యం జరగడంతో.. సినిమా విడుదలను మరో రెండు వారాల వెనక్కి పంపినట్టు ప్రకటించారు.
దీంతో ‘థ్యాంక్యూ’ మూవీ ముందు అనుకున్నట్టు జూలై 8న కాకుండా.. జూలై 22న విడుదల కాబోతోంది. ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ ల బాట పట్టింది. విక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మనం సినిమా మంచి సక్సెస్ ను అందుకోవడంతో.. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమాకు బీవీయస్ రవి కథను అందించగా.. తమన్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి వర్క్ చేయడం గమరార్హం.