నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా థాంక్యూ. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాన్నాళ్లయింది. ఆ వెంటనే నాగచైతన్య, వెబ్ సిరీస్ షూట్ కూడా స్టార్ట్ చేశాడు. ఆ షూటింగ్ కూడా పూర్తయింది. అయినప్పటికీ ఇంకా థాంక్యూ అప్ డేట్ రాలేదు. అలా కొన్ని రోజులుగా లైమ్ లైట్లో లేకుండా పోయిన ఈ సినిమాపై ఎట్టకేలకు అప్ డేట్ వచ్చింది.
థాంక్యూ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. 25వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను కూడా ఆసక్తికరంగా ఇచ్చారు మేకర్స్.
రికార్డింగ్ స్టుడియోలో సీరియస్ గా డబ్బింగ్ చెబుతుంటాడు నాగచైతన్య. పక్కనుంచి సీక్రెట్ గా కెమెరాతో చైతూను షూట్ చేస్తుంటారు. అది అర్థంకాక ఏం జరుగుతోందని, దర్శకుడ్ని అడుగుతాడు చైతూ. టీజర్ రిలీజ్ చేస్తున్నామని, దాని కోసమే షూటింగ్ అని విక్రమ్ కుమార్ చెప్పడంతో.. నాగచైతన్య చాలా ఎక్సయిట్ అవుతాడు.
పక్కాగా రిలీజ్ చేస్తారా, అందరికీ చెప్పుకోవచ్చా అంటూ మరోసారి డౌట్ గా అడుగుతాడు. దానికి విక్రమ్ కుమార్ పక్కా అని సమాధానం చెప్పడంతో నాగచైతన్య పొంగిపోతాడు.
ఈ వీడియోను విడుదల చేసి టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఎఫ్3 విడుదలైన వెంటనే థాంక్యూ సినిమా ప్రమోషన్లు మొదలవుతాయి.