జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఫ్లాప్ అయినా సరే కొన్ని సినిమాలు టీవీ లో వస్తే ప్రేక్షకులు చూస్తారు. ఆ సినిమాలు ఇప్పుడు వచ్చి ఉంటే సూపర్ హిట్ అంటారు ఫాన్స్. అలాంటి సినిమాలే రాఖీ, ఊసరవెల్లి, అశోక్. ఈ సినిమాల్లో ఎన్టీఆర్ నటన చాలా బాగుంటుంది. పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాడు ఈ సినిమాల్లో. దర్శకులు కూడా ఎన్టీఆర్ కు ఉన్న ఇమేజ్ ను బాగా వాడుకున్నారు.
కాని అప్పట్లో అభిమానులకు పెద్దగా సినిమా టేస్ట్ తెలియకపోవడంతో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా రాఖీ సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే సూపర్ హిట్ అయ్యేది. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో నటించిన అందరూ చాలా బాగా నటించారు. ఇదిలా ఉంచితే ఈ సినిమాలో రైల్ సీన్ ఒకటి బాగా హిట్ అయింది.
ఆ సీన్ కోసం కృష్ణ వంశీ ఒకటి రాసుకున్నారు. కాని అది ఎందుకో నచ్చలేదు. పక్కనే ఉన్న మరో రైటర్, నటుడు ఉత్తేజ్ మరో వెర్షన్ రాయడానికి రెడీ అయ్యారు. 15 నిమిషాల్లో ఆయన మరో వెర్షన్ రాసుకున్నారు. సినిమా ఉద్దేశం మొత్తం కూడా అందులో చెప్పాలి. అలా ఉత్తేజ్ చాలా వేగంగా సినిమాకే హైలెట్ అయ్యే విధంగా డైలాగ్ రాసారు. ఇక ఉత్తేజ్… రామ్ గోపాల్ వర్మ దగ్గర కూడా పని చేసారు.