కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాల వారు సంక్షోభంలో పడ్డారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీపై ఈ మహమ్మారి ఎఫెక్ట్ ఎక్కువగా పడింది. షూటింగ్స్ లేక తినడానికి తిండి కూడా లేక ఎంతో మంది సినీ కార్మికులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో మెగాస్టార్ చిరంజీవి ఒక సంస్థ స్టార్ట్ చేశారు.
అయితే ఈ చారిటీకి చాలా మంది స్టార్స్ తమ వంతు వివరాలను అందించారు. ఈ మహమ్మారి కారణంగా కార్మికులను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా దీనిని స్టార్ట్ చేశారు చిరు. ఈ చారిటీ కోసం మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్ తేజ్, శర్వానంద్, నాగచైతన్య, ప్రభాస్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా విరాళాలను అందజేశారు.
ఇంతమంది ఇచ్చినప్పటికీ స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాత్రం ఎటువంటి సహాయం చేయలేదు. ఇదే విషయమై రాజమౌళి పై గతంలో చాలా విమర్శలు వచ్చాయి. అయితే వారికి ఓ సమాధానం కూడా ఇచ్చాడు రాజమౌళి.
ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి క్యాన్సల్ అయ్యేవరకు అంత జరిగిందా ?
నేను, నా కుటుంబం నేరుగా ఎవరికి కూడా డబ్బులు విరాళంగా ఇవ్వట్లేదని కానీ వైరస్ బారిన పడిన వారి ప్రాణాలను ఎవరైతే కాపాడుతున్నారో వారికి అండగా నిలబడుతున్నామని రాజమౌళి చెప్పుకొచ్చాడు. కరోనా పేషెంట్ లకోసం ఇంత మంది ఉన్నారు వారిని కాపాడే వారికోసం ఎవరు ఉన్నారు అందుకే వైద్యులకు, పోలీసులకు పెద్ద ఎత్తున ప్రొటెక్ట్ కిట్ అందజేస్తున్నామని రాజమౌళి చెప్పుకొచ్చారు. సేవ చేసే వాళ్ళకి మరింత సేవ చేయడమే నా ధ్యేయమని అన్నారు.
ఇది కథేనా అన్నారు… 50 లక్షలు పెట్టి 2కోట్లు కొట్టాడు !!
నిజానికి డాక్టర్లు ధరించే కిట్స్ చాలా ఖరీదైనవి. అవి ఒక రోజు ధరించి పక్కన పెట్టాల్సిందే. అయితే వాటిని ఆర్ఆర్ఆర్ యూనిట్ తరపున కాకుండా వ్యక్తిగతంగా కూడా సమకూర్చే ప్రయత్నం చేసినట్లు చెప్పుకొచ్చారు.
అలాగే కరోనా క్రైసిస్ సంస్థపై కూడా స్పందించారు రాజమౌళి. ఎక్కడ ఏం జరిగినా మొదటి గా స్పందించేది టాలీవుడ్ హీరోలే నని… విరాళాలు ప్రకటించిన హీరోల అందరికీ నా ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు రాజమౌళి. అయితే రాజమౌళి గతంలో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.