సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయాడు. తన చిన్నారి అభిమాని క్యాన్సర్ తో పోరాటం చేస్తూ ఓడిపోయిందని ఎమోషనల్ న్యూస్ షేర్ చేశాడు. డేవిడ్ మిల్లర్ ఇన్ స్టాగ్రామ్ లో ఆ చిన్నారితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ..రిప్ యూ లిటిల్ రాక్ స్టార్ లవ్ యూ ఆల్ వేస్ అంటూ రాసుకొచ్చాడు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం చనిపోయిన చిన్నారి డేవిడ్ మిల్లర్ కూతురు అని తప్పుడు ప్రచారం జరుగుతుంది. కానీ ఆ చిన్నారి మిల్లర్ అభిమాని అని, కూతురు కాదని తెలుస్తుంది.నేను నిన్ను మిస్ అవుతాను. క్యాన్సర్ తో ఎనలేని పోరాటం చేశావ్. నాకు తెలిసినంత వరకు నీదే పెద్ద మనసు. ఎప్పుడు ముఖంపై చిరునవ్వు, సానుకూల దృక్పథంతో ఉంటావు. జీవితంలో ప్రతి క్షణాన్ని ఎలా ఆస్వాదించాలో నువ్వు నాకు నేర్పించావ్. నీ ప్రయాణంలో ప్రతి అవరోధాన్ని హత్తుకున్నావ్. నీతో కలిసి కొంత దూరం ప్రయాణం చేయగలిగాను. ఐ లవ్ యూ సో మచ్, రిప్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
ఈ పోస్ట్ ప్రతీ ఒక్కరిచేత కంటతడి పెట్టిస్తుంది.కాగా డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్నాడు. భారత్ తో జరుగుతున్న వన్డే సిరీస్ కోసం అతను ఇండియాకు వచ్చాడు. మొదటి వన్డే గెలుపులో మిల్లర్ కీలక పాత్ర పోషించాడు.
63 బంతుల్లో 75 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కాగా ఎప్పుడు మైదానంలో యాక్టివ్ గా ఉండే మిల్లర్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయాడు. తన చిన్నారి అభిమాని లేదనే వార్త తెలుసుకొని కన్నీరుమున్నీరయ్యాడు. చిన్నారి తనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.