పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనె హీరోయిన్ గా వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీదత్ ఎంతో భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ప్రాజెక్ట్ కె. మొదటి నుంచి అందరిలో ఈ క్రేజీ మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర చేస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా డానీ శాంచెల్ లోపెజ్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీకి సంబంధించి రెండు రోజులుగా ఒక న్యూస్ ప్రచారంలో ఉంది. ఈ మూవీని డైరెక్టర్ నాగ అశ్విన్ రెండు భాగాలుగా తీసేందుకు సిద్ధం అయ్యారని వార్త వచ్చింది.
అయితే తాజా టాలీవుడ్ బజ్ ప్రకారం ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, ప్రాజెక్ట్ కె మూవీ కేవలం ఒకటే సినిమాగా తెరకెక్కనుందని అంటున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 మొదట్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా భారతీయ ఇతిహాసం మహాభారతం స్ఫూర్తితో మూడో ప్రపంచ యుద్దం నేపథ్యంలో వస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని పోలిన పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన ఐదు యాక్షన్ బ్లాకులన్నాయట. ఈ యాక్షన్ సీన్స్ ను ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని రీతిలో తెరకెక్కిస్తున్నారట నాగ్ అశ్విన్.