మన జీవితంలో శునకాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. తల్లి తండ్రులు అనాధ ఆశ్రమాల్లో ఉన్నా సరే కుక్కలు మాత్రం మన పక్కలో ఉండాలి. వాటిని చాలా ప్రేమగా చూసుకుంటాం. వాస్తవానికి శునకం మనకు మంచి ఫ్రెండ్. మన మనస్తత్వం ఎలా ఉన్నా సరే దానికి ఏం కావాలో అది మాత్రమే తీసుకుంటుంది.
ఇక కుక్కలు కొన్ని ప్రమాదకరమైనవి. వాటికి కోపం వస్తే మనిషి ని కూడా చంపుతాయి. ఆకలిగా ఉంటే చంపి తినేస్తాయి కూడా. ఇక శునకాలు గిరిజన ప్రాంతాల్లో మనుషులకు ధైర్యంగా కూడా ఉంటాయి. వేటకు వెళ్ళడానికి గ్రామీణ ప్రాంతాల్లో శునకాలతో వెళ్తూ ఉంటారు. ఇలా ప్రమాదకరమైన శునకాలు కూడా ఉన్నాయి. అడవి జంతువులకు కూడా ఇవి చుక్కలు చూపిస్తాయి.
తమిళనాడు లో రాజపాలయం అనే ఊరిలో , రాజపాలయం అనే కుక్కలు ఉన్నాయి. అక్కడి ప్రజలు వాటిని ఎక్కువగా వేటకి ఉపయోగిస్తారు . ఈ కుక్కలు ఎంత బలంగా ఉంటాయి అంటే… నాలుగు కుక్కలు కలిసి ఒక పెద్ద పులిని కుడా బయపెట్టగలవు. రెండు కుక్కలు అయితే చిరుత పులిని కూడా చంపెస్తాయని… ఎలుగుబంటి వంటి వాటికి చుక్కలు చూపిస్తాయట. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కర్నూల్ జిల్లాలోని పందికోన అనే గ్రామంలో ప్రత్యేకమైన వేటకుక్కలు ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి ఆ గ్రామం వేట కుక్కలకు బాగా ప్రసిద్ధి.