దివంగత ప్రముఖ సంగీత దర్శకుడు చక్రీకి అప్పట్లో మంచి డిమాండ్ ఉండేది. ఆయన ఎన్నో సినిమాలకు మర్చిపోలేని సంగీతం అందించారు. ఆయన దగ్గర బాగా ఫేమస్ అయిన సింగర్స్ లో ముందుంటారు కౌశల్య. ఇప్పుడు ఆమె సైలెంట్ అయినా సరే ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు అవకాశాలు తగ్గిపోవడానికి కారణం కూడా చెప్పారు.
డబ్బులు విషయంలో తాను ఎప్పుడూ వెనకబడే ఉన్నానని ఆమె తన ఆర్ధిక పరిస్థితి గురించి వివరించారు. అలాగే తనకు జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పారు ఆమె. తనకు ఎవరు సరిగా పేమెంట్ ఇచ్చేవారు కాదని చక్రి గారు 5000 తో మొదలు పెట్టారని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే ఆయన మరణించే సమయానికి 4 లక్షలకు పైగా ఆయన దగ్గర నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయని ఆమె పేర్కొంది.
గుండెపోటుతో చక్రి మరణించడంతో ఆ డబ్బులను ఎవరిని అడగలేకపోయానని ఆమె తెలిపింది. కాని డబ్బులు ఇప్పటికి కూడా తనకు రాలేదని వాపోయింది ఆమె. ఇప్పుడు ఉన్న సింగర్స్ ఎక్కువగా ఫ్రీగా పాడటం లేదా తక్కువ డబ్బుకు పాడటం అలవాటు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. దీనితో సీనియర్ సింగర్స్ కి డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని తమను ఎవరు పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తమ పాటలు తగ్గిపోయాయని ఆమె పేర్కొంది.