సినిమా నటులు అందానికి ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడూ స్లిమ్ గా, ఫిట్ గా ఉండాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వాళ్ళు పలు రకాల చికిత్సలు చేయిస్తూ కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయే నటుల జాబితా కూడా ఎక్కువగానే ఉంది. తాజాగా ఒక కన్నడ నటి ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరుకు చెందిన చేతనా రాజ్ అనే 22 ఏళ్ల నటి కాస్మెటిక్ సర్జరీ చేయించుకుని ప్రాణాలు కోల్పోయింది.
Also Read:కేన్స్ ఫెస్టివల్ లో మెరిసిన ఇండియన్ సెలబ్రిటీస్
పలు టీవీ సీరియల్స్ లో ఆమె మంచి నటనతో ఆకట్టుకుంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు సుబ్రమణ్యనగర్ పోలీసులు క్లినిక్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆమె తండ్రి వరదరాజు క్లినిక్‌పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు. చేతన శుక్రవారం ఉదయం క్లినిక్‌కి వెళ్లారని లావుగా ఉందని వైద్యులు పట్టుబట్టడంతో నడుం పై ఉన్న కొవ్వు తీయించుకోవడానికి ఆమె ఓకే చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం, ఆమె శస్త్రచికిత్స అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత సరైన చికిత్స కోసం వైద్యులు ఆమెను వేరే ఆసుపత్రికి తరలించకపోవడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. క్లినిక్ పై పోలీసు కేసు నమోదు చేసినట్టు కన్నడ మీడియా పేర్కొంది. క్లినిక్ అనుమతి తీసుకోలేదని, శస్త్రచికిత్స చేసే ముందు ఆమె తల్లిదండ్రులకు చెప్పలేదని ఆమె బంధువు ఒకరు పేర్కొన్నారు.
క్లినిక్ యజమాని డాక్టర్ సాహెబ్‌గౌడ శెట్టిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇక సుబ్రమణ్యనగర్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ, “ఫిర్యాదు ఆధారంగా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసామని చెప్పారు. క్లినిక్‌పై తదుపరి చర్యలు తీసుకోవడానికి మేము పోస్ట్‌మార్టం నివేదికను మెడికల్ కౌన్సిల్‌కు పంపిస్తాం అన్నారు. బుధవారం ఆమెకు పోస్ట్ మార్టం నిర్వహిస్తారని ఆ తర్వాత బాడీని కుటుంబ సభ్యులకు ఇస్తాం అన్నారు.
Also Read:వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం..!