‘అగ్నిపథ్’పై దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పలు చోట్ల నిరసనకారులు రైళ్లపై దాడులు చేసి ర్వైల్వే ఆస్తులకు నష్టం కలిగించారు.
ఈ నేపథ్యంలో ‘అగ్నిపథ్’ వ్యవహారంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో జరిగిన హింసపై విచారణ జరిపేందుకు సిట్ ను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ లో కోరారు.
ఆందోళనల సమయంలో రైల్వేతో పాటు ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లిందని, వాటిపైనా సమగ్ర విచారణను జరిపించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. జాతీయ భద్రత, సైన్యంపై ఈ స్కీం ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలించడానికి సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్ దారులు కోరారు.
మరో వైపు ఆందోళనల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ కొనసాఉతోంది. పలు రైల్వే స్టేషన్లలో నిఘాను మరింత పటిష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లలో భద్రతను మరింత పెంచారు.