ప్రపంచ దేశాలు ఇదివరకు ఉగ్రవాదం గురించి ఆందోళన వ్యక్తం చేసేది కానీ ఇప్పుడు ఆయా దేశాలన్నీ కరోనా వైరస్ గురించి కలవరపాటుకు గురి అవుతోన్నాయి. నిజానికి ప్రపంచ దేశాలన్ని ఒకే అంశంపై ఆందోళన చెందటం ఇదివరకు ఎప్పుడు జరగలేని అంటున్నారు విశ్లేషకులు. ఎక్కడ చూసిన కరోనాపైనే చర్చ నడుస్తోంది. చైనాలో పురుడోసుకొని ప్రపంచ దేశాలకు అత్యంత వేగంగా వ్యాప్తి చెందింది కరోనా వైరస్. ఈ వైరస్ ప్రభావంతో వేలాదిమంది మరణిస్తుండగా.. లక్షలాది మంది ఈ వైరస్ సోకి ప్రాణభయంతో హడలిపోతున్నారు. ఈ వైరస్ గురించి తెలిసిన నాటి నుంచే దీని నివారణకు ప్రయత్నాలు జరుగుతోన్న అవేవీ ఓ కొలిక్కి రావడంలేదు. దాంతో కరోనా బాధితుల్లో ఓ రకమైన అభద్రతాభావం నెలకొంటుంది. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్ సోకినా వారిలో వేలాదిమంది మృత్యువాత పడుతుండటం రోగులను భయపెట్టిస్తోంది. కరోనాకు మందులేదనే విషయమే రోగులను మరింత భయపెడుతుండటంతో చాలా దేశాల్లో ఈ వైరస్ అంతానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం ఈ వైరస్ నివారణకు కనిపెట్టిన వ్యాక్సిన్ ను ప్రయోగించినట్లు అమెరికా చెబుతోంది.
సోమవారం ఓ వ్యక్తికి ఈ వ్యాక్సిన్ ను ఎక్కించి.. దాని పనితీరును తెలుసుకోనున్నారని అధికారులు తెలిపారు.అయితే ఈ వ్యాక్సిన్ ను పనితీరును ధృవీకరించడానికి ఏడాది నుంచి 18 నెలలు సమయం పడుతుందని చెబుతున్నారు.సీటెల్‌లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో జరుగుతున్న ఈ విచారణకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూరుస్తోందని అధికారి తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను45మంది యువకులపై ప్రయోగించనున్నట్లు చెప్పారు. అయితే ఈ వ్యాక్సిన్ వలన ఆ యువకులకు ఎలాంటి ప్రమాదమేమీ జరగబోదని.. ఎందుకంటే వారు ఎలాంటి వైరస్ కలిగి ఉండరని.. టికాల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలను చూపించలేవని తెలిపారు.అయితే ఈ వ్యాక్సిన్ ఫలితం ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది.