ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం లేదు. తన ఇష్టారాజ్యంగా చేస్తుంది అనే విమర్శలు వస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం కోత విధించింది జగన్ ప్రభుత్వం. దీనిపై విమర్శలు వచ్చిన వాటిని ఎవరు అంతగా పట్టించుకోలేదు. ఉద్యోగులు కూడా ప్రభుత్వ నిర్ణయం కదా అని సర్దుకపోయారు.
కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ ఉద్యోగులకు మొత్తం జీతాన్ని ఇచ్చింది. ఎక్కడ ఎలాంటి కోతలు లేకుండా జీతాలు చెల్లించింది. రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ఉద్యోగులకు కూడా ఆయా రాష్ట్రాలు మొత్తం జీతాన్ని చెల్లించాయి. కానీ ఆంద్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సెంట్రల్ జైల్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాళ్లకు మొత్తం జీతం ఇవ్వాలి. అలా కాకుండా తమకు 50 శాతం కోత విధించారని జైల్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము లాక్ డౌన్ లో కూడా ఎప్పటిలాగే పని చేశామని, తాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులమని అలాంటిది మా జీతాల్లో కోత ఎలా పెడుతారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
సెంట్రల్ జైల్ ఉద్యోగులు జీతాల్లో కోత విధించడం పై జైళ్ల ఐజీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలుస్తుంది, అయిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తాము మాత్రం పూర్తిగా తమ ఉద్యోగాన్ని నిర్వహించామని, ప్రభుత్వం పునరాలోచించి తమకు మొత్తం జీతం చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.