బోయపాటి,బాలయ్యలది ఎంత హిట్ కాంబినేషనో వేరే చెప్పక్కర్లేదు. వీరిద్దరు సినిమా చేస్తున్నారంటే హిట్ కొట్టారన్న మాటే..! సింహ,లెజెండ్,అఖండ లాంటి మూవీస్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.
అయితే మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని టాలీవుడ్ టాక్. అంతే కాదు గతంలో వచ్చిన లెజెండ్ కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు బోయపాటి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ తన 108వ చిత్రంలో నటిస్తున్నారు.
దీని తర్వాత ఆయన నటించబోయే చిత్రమేమిటన్నది ఆసక్తిగా మారింది.బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే బాలకృష్ణ 109 చిత్రాన్ని చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ జన్మదినమైన జూన్ 10న ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.
అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఈ సినిమా గత ఏడాది అద్భుత విజయం సాధించిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ కాదని.. ‘లెజెండ్’కు కొనసాగింపుగా ఉంటుందని తాజా సమాచారం. ఇందులో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని చెబుతున్నారు.
అయితే ఈ సినిమా గురించి పూర్తి సమాచారం తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. బాలకృష్ణ-అనిల్‌రావిపూడి కాంబో చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది.