ప్రియురాలి కోసం విలువైన ఆభరణాలు చేయించారు. అరణాలు రాసి ఇచ్చారు. అద్భుత కట్టడాలు కట్టించారు.అయితే ఓ ప్రేమికుడు తన ప్రియురాలి కోసం అద్భుతమైన రైడ్ చేసాడు.
ఆమె కోరిక మేరకు ట్రాఫిక్ రూల్స్ సైతం తుంగలోకి తొక్కాడు. వేగంలో భాగంగా దారిమధ్యలో చాలా చాలా విన్యాసాలు చేసాడనుకోండి..! ఆమె లవ్వర్ ఓ జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉండడంతో మన వాడు ఈ సాహసం చేసాడు. ఏం చేస్తావో తెలియదు ఇంటర్వ్యూకి టైమ్ కి వెళ్ళాలని ఆమె చెప్పింది.
ఇంకేముంది..! మన వాడు రెచ్చిపోయాడు. అమెరికాలో ఫ్లోరిడాలో జెవన్ పీర్ జాక్సన్ (22) అనే వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఆవిధంగా దూసుకెళ్లాడు.ఎక్కడైతే ఏంటి ప్రేమికుడు ప్రేమికుడే కదా..!?
అది కూడా ఎవరికోసమంటే తన ప్రియురాలి కోసమే. జెనన్ ప్రియురాలికి ఓ ఇంటర్వ్యూ ఉంది. అక్కడికి వెళ్లేందుకు జెవన్ పీర్ తో కలిసి ఆమె కారులో బయలుదేరింది.
దీంతో జెవన్ రెచ్చిపోయాడు. కారు వేగాన్ని అమాంతం పెంచేశాడు. గంటకు 65 కిలోమీటర్లు ప్రయాణించాలని నిబంధన ఉన్న జోన్ లో.. గంటకు సుమారు 160 కిలోమీటర్ల వేగంతో కారును నడిపాడు.
రోడ్డుపై వేగంగా వెళ్తుండగా కొన్ని వాహనాలను కూడా ఢీ కొట్టబోయాడు. కానీ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే జెవన్ ఢీకొట్టబోయిన వాహనాల్లో పోలీసు వాహనంతో పాటు మరో ముగ్గురు చిన్నారులు ఉన్న వాహనం ఉండటంతో పోలీసులు అతడ్ని వెంబడించారు.
ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించడమే కాకుండా చిన్న పిల్లలకి హాని జరగబోయిందని కేసు పెట్టారు. అతని లైసెన్స్ ను కూడా రద్దు చేశారు. చివరికి అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లారు. వాస్తవానికి అమెరికాలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.