పెళ్లి అనగానే వధువు కానీ.. వరుడు కానీ.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నామనే సంబరంలో మురిసిపోతారు. పెళ్లికి వచ్చిన పెద్దల ముందు సిగ్గు వలకపోస్తూ మైమరిసిపోతారు. ఇక.. కార్లో ఎంట్రీ ఇచ్చి అందరి చూపు వారిపైనే పడే విధంగా తయారవుతారు. కానీ.. ఓ యువతి అందుకు భిన్నంగా ట్రాక్టర్ లో పెళ్లి మండపానికి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంచలన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
బెతుల్ జిల్లాలోని జావ్రా గ్రామానికి చెందిన భారతీ తగ్డే అనే యువతికి వసు కవద్కర్ అనే వ్యక్తితో జరిగింది. అయితే.. జీవితాంతం గుర్తిండిపోయేలా తన పెళ్లి రోజున ఏదైనా డిఫరెంట్ గా చేయాలనుకుంది భారతి. దీంతో ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ పెళ్లి మండపానికి వచ్చింది.
సాంప్రదాయ కట్టుబాట్లకు స్వస్తి చెప్పి..రెడ్ ఎంబ్రాయిడ్ లెహెంగా ధరించి.. కళ్లకు బ్లాక్ సన్ గ్లాస్ లు పెట్టుకొని తనే సొంతంగా ట్రాక్టర్ నడుపుకుంటూ పెళ్లి మండపానికి వచ్చింది. దాంతో వివాహ వేడుకలకు వచ్చిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
భారతీ ట్రాక్టర్ పై పెళ్లి మండపానికి చేరుకున్న వీడియోపై ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. భారతి అనే వధువు స్వరాజ్‌ను నడుపుతోంది. ఒక @మహీంద్రా రైజ్ బ్రాండ్ అంటే అర్థం చేసుకోండంటూ ఆయన ట్వీట్ చేశారు.