సహజంగా వధువు కానీ.. వరుడికి కానీ.. పెళ్లి ఇష్టం లేకపోతే తీరా తాళి కట్టే సమయానికి వచ్చి.. ఆపండి అని వారికి సంబంధించిన ప్రేమికులు వచ్చి ఆనడం సినిమాల్లో చూస్తుంటాం. ఇంకొందరు అయితే.. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో కనబడకుండాపోవడం చూస్తుంటాం.. కానీ.. ఓపెళ్లి పెళ్లికూతురు అందరి ఆశ్చర్య పరిచేలా వ్యవహరించి పెళ్లినుండి తప్పించుకుంది.
ఇరువురి పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో ఓ పెళ్లి వేడుక జరుగుతుంది. ఈ క్రమంలో పెళ్లి కూతురు ఒక్కసారిగా అందరికి షాకిచ్చింది. నీకు చదువులేదు అంటూ పెళ్లి కూతురు ఉన్నఫలంగా పీటలపై నుండి లేచి పోయింది.
దీంతో పెళ్లి కొడుకుతో పాటు.. అక్కడున్న వారంతా ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా అని బంధువులు ప్రశ్నించగా.. తాను బీఈడీ చదుకున్నానని.. తనతో ఇంగ్లీష్ మాట్లాడితేనే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది.
అయితే.. డబ్బుల కోసం అతడిని పెళ్లి చేసుకోమని తన తండ్రి బలవంతం చేశాడని చెప్పుకొచ్చింది ఆ యువతి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు పెడుతున్నారు.