హైదరాబాద్ తో పాటు నగర శివారు ప్రాంతాల్లో మళ్లీ క్రైం పెరుగుతోంది. మర్డర్లు, మానభంగాలు, సైబర్ క్రైం రేట్ రోజు రోజుకి పెరుగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడి మర్డర్ కలకలం సృష్టించింది. ఉస్మాన్ నగర్ కు చెందిన మామా జఫర్ కుమారుడు ఫైసల్ కిడ్నాప్ అయిన కొన్ని గంటల్లోనే మర్డర్ కు చేయబడ్డాడు.
ఈ నెల 12న రాత్రి 9 గంటల సమయంలో.. ఉస్మానియా హోటల్ వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అర్థరాత్రి అయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు అతడికి ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చి అతడి కోసం వెతికారు.
ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తండ్రి జాఫర్ బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం శనివారం రాత్రి ఒంటి గంట సమయంలో మర్డర్ జరిగినట్లు సమాచారం అందింది. అయితే ప్రాథమికంగా 17 ఏళ్ళ జబ్బార్ ను హంతకుడిగా పోలీసులు గుర్తించారు.
ఇతడు వృత్తిరీత్యా కాస్మెటిక్స్ సేల్స్ చేస్తుంటాడు. మినర్ కాలనీకి చెందిన వాడు. షాహిన్ నగర్లో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే హత్యకు గల కారణాలు మాత్రం దర్యాప్తులో తేలాల్సి ఉంది.