శ్రీకాకుళం జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టిన ఘటనలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని ప్రయాణికులు చెప్తున్నారు.
జిల్లాలోని రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అయితే.. ఆ వంతెనపైన ఓలారీ ఆగిఉంది. ఆ మార్గంలో వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు. ఆగిఉన్న లారీని ఢీకొట్టింది.
ఈ బస్సుప్రమాదంలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమం గా ఉన్నట్టు తెలుస్తోంది. గాయాలపాలైన బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
అయితే.. ఈ బస్సు ఒడిశా నుంచి కేరళ వెళ్తుండగా ఘటన జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. బాధితులంతా ఒడిశాకు చెందిన వలస కూలీలుగా పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.