సిద్దిపేట జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ముందుగా స్థానికులు ఈ ఘటనను గుర్తించడంతో..హుటాహుటిన మృతదేహాలను కాలువలో నుంచి తీసే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు.
అయితే జగదేవ్ పూర్ మండలం మునిగడప వద్ద ఒక్కసారిగా కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఆ సమయంలో కారులో ఆరుగురున్నట్టుగా గుర్తించడం జరిగింది. వీరందరూ వేములవాడ నుండి బీబీనగర్ కు వెళ్తున్నారు. వెంకటేశ్, సమ్మయ్య, స్రవంతి, లోకేష్ ,లోకేష్ రాజమణి ,భవ్య శ్రీ లుగా మృతులను గుర్తించడం జరిగింది. వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్లి తిరిగి బీబీనగర్ కు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. తరువాత కారును కూడా పోలీసులు గుంతలో నుంచి బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు జలసమాధి కావడంతో బీబీనగర్ లో విషాదం అలుముకుంది.