టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలన్నింటినీ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లీకైందన్న వార్త తెలిసి హైదరాబాద్ లోని సెంట్రల్ లైబ్రరీ వద్ద అభ్యర్థులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కోదండ రామ్ పాల్గొని మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ వ్యవహారాన్ని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు.
అనేక మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ ఏర్పడిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక ఈ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారం పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
ఈ లీకుల వ్యవహారం ఎన్నో మలుపులు తీరుగుతున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా లీకై ఉండొచ్చన్న వదంతులు వస్తున్నాయన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా మౌనంగా ఉందన్నారు. లక్షలాది నిరుద్యోగుల కోసం పోరాడుతున్న బీఎస్పీ కార్యకర్తలను మాత్రం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని..కేసీఆర్ ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు.