ఆగ్నేయాసియా దేశాలు, యూరప్ లోని కొన్ని దేశాల్లో ఇటీవల కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది.
పలు దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్, వ్యాక్సినేషన్ లతో కూడిన ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
మార్చి 16న కేంద్ర కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల అదనపు ముఖ్య కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వివరించారు.
ప్రస్తుతం వీలైనంత ఎక్కువగా జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలను చేయాలని, కొవిడ్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు జాగరుకతతో ఉండాలని సూచించారు. సమయానికి అనుగుణంగా కొత్త కరోనా కేసులను గుర్తించాలని, కరోనా నిబంధనలను పాటిస్తూ ఉండాలని రాష్ట్రాలకు సూచించారు.