వరి ధాన్యం కొనుగోళ్లపై ఓవైపు యుద్ధం నడుస్తుండగా… ఇంకోవైపు పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన చేసింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది కేంద్ర ఆహార, ప్రజా సరఫరాల మంత్రిత్వశాఖ.
తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతోందని తెలిపింది కేంద్రం. గోధుమ లేని కారణంగా ఏపీ, తెలంగానలో వరి మాత్రమే సేకరిస్తున్నామని వివరించింది. గత మూడేళ్లలో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు వెల్లడించింది.
2018-19లో ఏపీ నుంచి 48.06 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 51.90 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు తెలిపింది కేంద్రం. అలాగే 2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 74.54 లక్షల మెట్రిక్ టన్నులు, 2020-21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు వివరించింది.
ఇక ఎఫ్‌సీఐ ఆస్తుల అమ్మకానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చింది. ఎలాంటి అమ్మకాలు జరగడం లేదని స్పష్టం చేసింది కేంద్రం