కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఎన్డీఏలో చేర్చేందుకు మంగళవారం నిర్ణయం తీసుకున్నట్లు గా కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ముగ్గురు సర్వీస్ చీఫ్ లతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళింది.
కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య జస్టిస్ సంజయ్ కిషన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీనికి సంబంధించిన నివేదికను అందించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలను చేర్చాలని అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నామని 3 సాయుధ దళాల అధిపతులు కూడా ఈ నిర్ణయాన్ని అంగీకరించారని మంగళవారం సాయంత్రం ఆలస్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
అయితే దీనిపై జస్టిస్ కూల్ స్పందిస్తూ కోర్టు అధికారులను కొన్ని సార్లు ప్రశ్నించినప్పుడు మాత్రమే కొన్ని కొన్ని విషయాలు ముందుకు కదులుతాయని సాయుధ దళాలు దేశంలో గౌరవనీయ శక్తులను అందులో లింగ సమానత్వం అనేది ఉండాల్సిన అవసరం ఉందని దీనిపై మరింత దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలను చేర్చేందుకు సాయుధ దళాలు స్వయంగా నిర్ణయం తీసుకున్నాయని తెలుసుకున్న కోర్టు… దీనిపై సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో మహిళల పాత్ర ఏంటి భవిష్యత్తులో మహిళల పాత్ర ఏంటి అనేది సుప్రీంకోర్టుకు తెలియజేయమని కేంద్రాన్ని ధర్మాసనం కోరింది.