కే జి ఎఫ్ చాప్టర్2… ఏప్రిల్ 14న భారీ అంచనాల మధ్య ఈ చిత్రం తెరకెక్కింది. కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
2018 లో వచ్చిన కేజిఎఫ్ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా రవీనాటాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రలలో నటించారు. అలాగే రవి బసృర్ సంగీతం అందించారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ALSO READ: లాజిక్ నిజమే… ఆచార్య ఫ్లాప్? ఎలాగో తెలుసా !!
అదేంటంటే కే జి ఎఫ్ చాప్టర్2 ఎడిటర్ 19 ఏళ్ల కుర్రాడు. అవును మీరు విన్నది నిజమే!! మామూలుగా అయితే ఒక సినిమాకు ఎడిటింగ్ చేసే వ్యక్తి ఎంతో ఎక్స్పీరియన్స్ ని కలిగి ఉంటాడు. కే జి ఎఫ్2 లాంటి పాన్ ఇండియా సినిమా ఎడిటర్ అంటే వేరే లెవెల్ లో ఉండాల్సిందే. అలాంటిది 19 ఏళ్ల కుర్రాడు కేజిఎఫ్ 2 ఎడిటర్ అంటే ఆశ్చర్యపోవాల్సిందే. కానీ అదే నిజం.
ఆ కుర్రాడి పేరు ఉజ్వల్ కులకర్ణి. ఈ కుర్రాడు షార్ట్ ఫిలిమ్స్ అలాగే ఫ్యాన్ ఎడిట్స్ చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలోనే కే జి ఎఫ్ 1 కి సంబంధించిన కొన్ని క్లిప్స్ ఎడిట్ చేశాడు. అవి చూసిన ప్రశాంత్ నీల్ ఇంప్రెస్ అయి కే జి ఎఫ్ చాప్టర్ 2 టీజర్ కట్ చేసే బాధ్యతను అప్పగించాడు. కులకర్ణి కట్ చేసిన టీజర్ కు ప్రశాంత్ పూర్తిస్థాయిలో ఇంప్రెస్ అయ్యి కేజిఎఫ్ 2 ఎడిటింగ్ పూర్తి బాధ్యతను కులకర్ణికి ఇచ్చేసాడు.
Advertisements
ALSO READ:సైడ్ క్యారెక్టర్స్ నుంచి హీరోలుగా మారిన మన హీరోస్
కట్ చేస్తే కే జి ఎఫ్ చాప్టర్ 2 థియేటర్స్ లో బ్లాక్ బస్టర్. ఈ 19 ఏళ్ల కుర్రాడు పనితనాన్ని అందరూ ఇప్పుడు ప్రశంసిస్తున్నారు.