రష్యా దేశానికి చెందిన ప్రోమోబోట్ (Promoboat) అనే కంపెనీ ఓ కంపెనీ బంపర్ ఆఫర్ ఇస్తోంది.ఇక ఈ కంపెనీ ఇచ్చిన యాడ్ ప్రకారం వీరికి ఓ వ్యక్తి తల కావాలి.భయపడకండి వారు తలను కట్ చేసి తీసుకోరు. ఆ తల ఎలా ఉందో అచ్చం అలాంటి తలను తయారుచేసి… రోబోకి సెట్ చేస్తారు. ఇలా తన తల డిజైన్, రూపురేఖల్ని ఇచ్చే వ్యక్తికి ఈ కంపెనీ £1,50,000 ఇస్తామని ప్రకటించింది. మన రూపాయిల్లో ఇది రూ.1,50,09,332. అంటే ఫేస్ ఇచ్చే వ్యక్తి కోటీశ్వరుడు అవ్వగలడు.ఇలా తలని ఇచ్చే వ్యక్తి తన తలను ఇచ్చినట్లుగా లిఖితపూర్వకంగా అగ్రిమెంట్ చేసుకుంటారు.
ఆ తర్వాత ఇచ్చిన ఆ వ్యక్తి తలపై పూర్తి హక్కలు ఇక ఈ కంపెనీకే ఉంటాయి.ఈ కంపెనీ రియల్ లైఫ్ రోబోలు తయారుచేసే పనిలో ఉందట. అందులో భాగంగానే నిజమైన ముఖ ఆకృతులను తయారుచేయడం ద్వారా.. తమ రోబోలు.. రియల్ మనుషుల లాగా ఉంటాయన్నది ఈ కంపెనీ ఆలోచన. అందుకోసమే రియల్ ఫేస్ కావాలంటోంది.ఇచ్చే వ్యక్తి ఫేస్ చూడటానికి చక్కగా అందంగా ఉండాలి.మంచి ఫ్రెండ్లీ ఫేస్ ఉండాలి.
కోపంగా అస్సలు ఉండకూడదు. అలాంటి ఫ్రెండ్లీ ఫేసును డిజైన్ చేసి… దాన్ని రోబోకి పెట్టడం ద్వారా… ఆ రోబోను చూసిన వారికి కూడా ఫ్లెండ్లీ ఫీల్ కలుగుతుంది అని కంపెనీ భావిస్తుంది.స్త్రీలు, పురుషులు ఎవరైనా ఇతర అన్ని వర్గాల వారూ అప్లికేషన్లు పెట్టుకోవచ్చని కంపెనీ తెలిపింది.కానీ ఇక్కడ ఒక కండీషన్ మాత్రం ఉంది. అప్లై చేసుకునేవారి వయస్సు 25 ఏళ్లు దాటి ఉండాలి. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇక్కడ వుంది చూడండి.
.https://youtu.be/ZlYVPVe3B40