కోటూరి మానవతారాయ్.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి
మోడీ, కేసీఆర్ లపై దండయాత్రలా సాగిన రేవంత్ రాజీవ్ రైతు భరోసా పాదయాత్రకి నేటితో యాడాది పూర్తయింది. నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అధ్యక్షతన రాజీవ్ రైతుభరోసా దీక్ష అచ్చంపేటలో జరిగింది. తన సొంత నల్లమలగడ్డలో జరుగుతున్న దీక్షకి అప్పుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పటికే డిల్లీలో పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాల రైతులు నరేంద్ర మోడీ తెచ్చిన మూడు నల్లచట్టాలకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. యావత్ దేశ రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ఆ చట్టాలకు వ్యతిరేకంగా డిల్లీ రైతల ఉద్యమానికి మద్దతుగా మన దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా ఉద్యమాలు జరగలేదు.ఈ విషయం తెలిసుకున్న కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు.. పార్లమెంట్ సభ్యలు తమ తమ ప్రాంతాల్లో రైతులకు మద్దతుగా ఉద్యమించాలని సూచించారు. వెంటనే పార్టీ శ్రేణులతో కలిసి రేవంత్ రెడ్డి రైతులకు మద్దతు పలికారు. రేవంత్ రెడ్డికి ఇట్లాంటి పోరాటలు కొత్తకాదు. పాదయాత్రలు కొత్తకాదు. గతంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా కార్మిక, కర్షక, విద్యార్థి, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి.. సుమారు 300 కిలోమీటర్లు ఉత్తర, దక్షిణ తెలంగాణలో పాదయాత్రలు చేశారు. అనేక ప్రజా సమస్యలపై గళమెత్తారు. రోజుకి 20కిలోమీటర్లు పాదయాత్ర చేసి సాయంత్రం 30 నుండి 40 వేల మందితో భారీ బహిరంగ సభలు నిర్వహించి అప్పటి పాలకులకు దడపుట్టించారు.
రేవంత్ రెడ్డి అచ్చంపేటలో రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టారు. డిల్లీ రైతుల పోరాటనికి బాసటగా నిలిచారు. డిల్లీ రైతులకోసం వెన్నుదన్నుగా నిలిచిన ఏకైక దక్షణాది నాయకుడుగా చరిత్రలో నిలిచారు. అచ్చంపేట రైతు దీక్షలో మాజీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. రైతుల సూచన మేరకు.. అచ్చంపేట రైతు దీక్షను అనూహ్యంగా రాజీవ్ రైతు భరోసా యాత్రగా మార్చారు. తన ప్రసంగం ముగియగానే హుటాహుటిన పాదయాత్రకు బయలుదేరారు రేవంత్ రెడ్డి. ఆ సభకు హాజరైన వేలాదిమంది ప్రజలు రేవంత్ రెడ్డి వెంట పాదయాత్రగా కదిలారు. అడుగడుగున ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ముందుకు సాగారు రేవంత్ రెడ్డి. పొలాల్లోకి వెళ్ళి రైతులను, కూలీలను పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతానని భరోసా కలిపించారు. పాదయాత్ర చేసేటప్పుడు ఊరుకొండపేటకి చెందిన పారిజాత గౌడ్ అనే విగలాంగురాలు దారిలో రేవంత్ రెడ్డి పలకరించింది. తాను నడవలేకపోతున్నాను అని రేవంత్ రెడ్డికి చెప్పింది. తనకు ఓ మూడు చక్రాల బండి ఇప్పించాలని వేడుకుంది. వెంటనే స్పందించిన ఆయన.. అప్పటికప్పుడు 50 వేల విలువ చేసే బ్యాటరీతో నడిచే మూడు చక్రాల బండిని వికలాంగురాలికి బహుకరించారు.
పాదయాత్రలో భాగంగా గొల్లకురుమల గొంగడి కప్పుకుని.. గొర్రెపిల్లను ఎత్తుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కల్వకుర్తి దగ్గర ఒక గ్రామంలో కొలిమి రాజేసుకుంటున్న కమ్మరివృత్తి చేసుకుంటూ జీవనం సాగించే నారాయణను పలకరించారు. తన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నారాయణకి ఆర్థిక సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, విశ్వకర్మ, నాయిబ్రాహ్మణ, రజక, యాదవ,గౌడ, మున్నూరు కాపు, ముదిరాజు వంటి సబ్బండ వర్గాల ప్రజలతో మమేకం అయ్యారు. ఓయూ విద్యార్థి సంఘాల నేతలు, పాలమూరు విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగ సంఘాల నేతలు, కార్మిక సంఘాల నేతలు, తెలంగాణ విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ టీచర్లు ఈ పాదయాత్రకు సంఘీబావం తెలిపారు. వారి సమస్యలు చెప్పుకున్నారు. రైతుబిడ్డగా రైతులతో భోజనం చేస్తూ.. వరి, కంది మిరప, వేరుశనగ, పత్తి, ఇతర పంటల సాగులో ఎదురవతున్న సమస్యలను తెలుసుకున్నారు. నరేంద్ర మోడీ తెచ్చిన మూడు నల్ల రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. పాదయాత్రలో దారిపొడువునా రేవంత్ రెడ్డి గర్జించారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు తండోపతండాలుగా జనాలు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి బీజేపీ టీఆర్ఎస్ పార్టీల నేతలు గడగడలాడారు. రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తం పాదయాత్ర చేయాలని.. యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. వారి ఆశలపైకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నీళ్ళు చల్లింది. పాదయాత్ర దిగ్విజయంగా హైదరాబాద్ చేరుకునే సమయానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డురావడంతో రావిర్యాల బహిరంగ సభతో ముగించాల్సి వచ్చింది.
పాదయాత్ర తరువాత రేవంత్ ఢిల్లీ వెళ్లి రైతు సంఘం నాయకుడు రాకేష్ తికాయత్ తో కలిసి సంఘీభావం తెలిపారు. 10 రోజుల పాటు 120 కిలోమీటర్లు పాదయాత్ర నిడిచింది. నేను చివరివరకు రేవంత్ రెడ్డితో పాదయాత్రలో పాల్గొన్నాను. పిబ్రవరి 7 నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ పాదయాత్ర మదుర స్మృతులను నెమరవేసుకుంటూ, మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ పాలన నుండి విముక్తి కోసం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ బారి నుండి అంబేడ్కర్ రాసిన రాజ్యాగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడలని తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.