మీర్పేట్ రహదారిపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‌ని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు అడ్డుకున్నారు. టెట్ పరీక్షను వెంటనే వాయిదా వేయ్యాలని డిమాండ్ చేశారు.
మీర్పేట్ కార్యక్రమంలో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందించే ప్రయత్నం చేశారు ఎన్‌ఎస్‌యూఐ నాయకులు. మంత్రిని కలవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో కాన్వాయ్ కి అడ్డుపడ్డారు. దీంతో పోలీసులకు నిరసన కారులకు మద్య తోపులాట జరిగింది.
అందులో భాగంగా.. రంగారెడ్డి జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సహా.. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మీర్పేట్ స్టేషన్ కు తరలించారు.
గత 15 రోజుల నుండి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలిసి టెట్ అభ్యర్థుల సమస్యపై వివరించేందుకు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ప్రయత్నించారు. కానీ.. మంత్రి అవకాశం ఇవ్వలేదు. దీంతో మరోసారి మంత్రిని అడ్డుకున్నారు నాయకులు.