సాయి ధరమ్ తేజ్ కు బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టమని మెగా ఫ్యాన్స్ కు తెలిసిందే. షూటింగ్ లేదంటే చాలు వీకెండ్స్ లో ఫ్రెండ్స్ తో కలిసి బైక్ పై తేజ్ దూసుకెళ్తుంటాడు. అయితే, బైక్ రైడింగ్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. గతంలో తన ఫ్రెండ్స్ తో కొండపోచమ్మ రిజర్వాయర్ కు బైక్స్ పై వెళ్లి అక్కడ సందడి చేశాడు.
అయితే, తేజ్ వాడిన బైక్ ను ఇటీవలే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ బైక్ అనిల్ కుమార్ బురా పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఇది స్పోర్ట్స్ బైక్. 1160సీసీ కెపాసిటీ. 228కిలోల బరువు ఉండే ఈ బైక్ ఈ వెర్షన్ లో హై ఎండ్ బైక్ అని తెలుస్తోంది. క్షణాల్లో కనిపించనంత వేగంగా దూసుకెళ్లటం ఈ బైక్ స్పెషాలిటీ. ఈ బైక్ ధర 18లక్షలని తెలుస్తోంది.
తేజ్ పడిన వేగానికి హెల్మెట్ లేకుంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని, అయితే హెల్మెట్ వాడిన దాన్ని లాక్ చేయకపోవటం వల్ల కంటి వద్ద చిన్న ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.