ఎస్బిఐ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కు టోకరా వేసి ఆరు లక్షల కాజేసారు కేటుగాళ్లు. ఆన్ లైన్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించిన బాధితుడికి ఫోన్ చేసి మీ బిల్లు చెల్లింపు అప్డేట్ కాలేదని… యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవాలని చెప్పారు. అంతే కాకుండా టీఎస్ ఎస్పీడీసీఎల్, క్విక్ సపోర్ట్ యాప్స్ లింకులను బాధితుడి మొబైల్ కు పంపారు.
క్విక్ సపోర్ట్ యాప్ ఓపెన్ చేసి డెబిట్ కార్డు వివరాలు నమోదు చేయగానే పలు విడతలుగా 10 నిమిషాల్లో 5.80 లక్షలు తమ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. దీనితో బాధితుడు ఎస్బిఐ రిటైర్డ్ బ్రాంచ్ మేనేజర్ శివరామకృష్ణ శాస్త్రి సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.