దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ లు తమ ప్రేమ ప్రయాణానికి ముగింపు పలికి.. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి రెడీ అయ్యారు. అయతే.. ఈ కోలీవుడ్ లవ్‌బర్డ్స్ నయనతార, విఘ్నేష్ ల పెళ్లి ముహర్తం డేట్ ఫిక్స్ చేసుకున్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల స్వామివారి సన్నిధిలో ఒక్కటయ్యేందుకు నిర్ణయించుకున్నారు. జూన్ 9న ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటి కాబోతోంది. ఇందులో భాగంగానే తమ పెళ్లి వేదికను బుక్ చేసుకోవడానికి నయనతార, విఘ్నేశ్ లు తిరుమల తిరుపతికి వచ్చినట్టు తెలుస్తోంది.
శనివారం వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంది ఈ జంట. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గత రెండు రోజుల క్రితం ఈ జంట షిర్డీ సాయిబాబాను కూడా దర్శించుకున్నారు.
Advertisements
నయనతార తమిళ, తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. విఘ్నేష్ శివన్ దర్శకుడిగా పరిచయమైన నానుమ్ రౌడీథాన్ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గత ఏడేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. చివరకు ఒక్కటయ్యేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.