తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మర్చిపోలేని హీరోయిన్ సదా. ఇప్పుడు బుల్లి తెర మీద వచ్చే పలు కార్యక్రమాలకు ఈమె జడ్జిగా చేస్తుంది. అయినా సరే తన అందంతో ఆకట్టుకుంటుంది. సినిమాల్లో అవకాశాలు వస్తే మాత్రం కచ్చితంగా ఏ విధమైన పాత్ర అయినా సరే నటిస్తా అని చెప్తుంది. ప్రస్తుతం ఒక స్టార్ హీరోకి చెల్లెలి పాత్రకు ఈమెను ఫైనల్ చేసారు అని టాక్ ఉంది.
ఇదిలా ఉంటే ఈమె నటించిన మొదటి సినిమా జయం అప్పట్లో సంచలనం సృష్టించింది. గోపిచంద్ విలన్ గా తేజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. నితిన్ కి కూడా ఇదే మొదటి సినిమా. తేజా ఈ సినిమాను నిర్మించడమే కాకుండా చాలా బాధ్యతలు తీసుకున్నారు. కథలో పట్టు ఉండటంతో సినిమా మంచి హిట్ అయింది. అప్పట్లో ఎక్కువ బిజినెస్ చేసిన సినిమా ఇది.
విడుదలకు ముందు రూ.3.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే చేసినా… రూ.15.16 కోట్ల షేర్ ను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక షూటింగ్ సమయంలో ఒక సన్నివేశం జరిగింది. సదా ఒక సీన్ లో ఏడవాల్సి ఉండగా ఆమెకు ఏడుపు రావడం లేదట. టేకులు మీద టేకులు తీసుకోవడంతో డైరెక్టర్ తేజా ఆమె చెంప మీద ఒక దెబ్బ కొట్టారట. అక్కడ ఉన్న వారు షాక్ అయినా ఆమె మాత్రం బోరున ఏడ్చింది. సీన్ కూడా ఆ ఏడుపు తో బాగా వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సదానే చెప్పుకుంది.