అప్పట్లో మహానటి సావిత్రికి చాలా మంచి క్రేజ్ ఉండేది. ఆమె కోసం తమిళంలో కూడా చాలా మంది ఎగబడేవారు. అయితే ఒక దర్శకుడు ఆమెను చాలా ఎక్కువగా ప్రేమించారట. ఈ విషయాన్ని దిగ్గజ నటుడు గుమ్మడి తన పుస్తకంలో రాసుకున్నారు. సావిత్రికి తమిళం లో తెలుగు కంటే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని అని ఆయన రాసుకున్నారు. అప్పట్లో రోజు చాల మంది తమిళులు ఆమె చుట్టూ చేరేవారని రాసారు.
కొంత మంది నటీనటులైతే సావిత్రి ఎలా నటిస్తుందో చూసి నేర్చుకుందామని వచ్చేవారని పేర్కొన్నారు. ఈ క్రమం లోనే పిళ్ళై అనే ఒక డైరెక్టర్ సావిత్రి అంటే తెగ అభిమానం చూపిస్తూ ఆమె చుట్టూ తిరిగేవాడు. సావిత్రి ఎక్కడ షూటింగ్ లో ఉంటె పిళ్ళై అక్కడే ఆయన కూడా ఉండేవాడు. పిళ్ళై ఆశ మాషి వ్యక్తి ఏమి కాదన్నారు గుమ్మడి. మంచి సినిమాలు తీసి గొప్ప దర్శకుడిగా పేరు తెచుకున్నాడని తెలిపారు.
షూటింగ్ లో ఉన్న కూడా సాయంత్రం అయితే… షూటింగ్ ఆపి సావిత్రి ఉండే దగ్గరకు వచ్చేవాడు అని అలా ఆమెతో ప్రేమలో పడ్డాడు అని… కాని ఆయనకు జెమిని గణేషన్ తో ప్రేమలో ఉందనే విషయం తెలియదని పేర్కొన్నారు గుమ్మడి. ఆ తర్వాత ఆయన సావిత్రిని ప్రేమిస్తున్నట్టు ఒక ప్రపోజల్ పంపి… తనకు స్నేహితుడు అయిన గుమ్మడికి అసలు విషయం చెప్పి మాట్లాడాలి అని కోరారట. కాని జెమిని గణేషన్ తో ప్రేమలో ఉందని చెప్పడంతో సినిమాలు మానేసి వెంటనే సొంత ఊరు వెళ్ళిపోయాడట ఆయన.