ఈ మధ్య కాలంలో ఓటీటీలో సూపర్ హిట్ అయిన షో అన్ స్టాపబుల్. ఈ షో విషయంలో ఆహా యాజమాన్యం, నందమూరి బాలకృష్ణ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ ని కాస్త గ్రాండ్ గా ప్లాన్ చేసింది ఆహా యాజమాన్యం. మొదటి సీజన్ లో రాజకీయ అంశాలు లేకపోయినా రెండో సీజన్ లో మాత్రం రాజకీయ నాయకులు కూడా వచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడం కాస్త సంచలనం అయింది. అయితే ఈ షో గురించి దర్శకుడు బీవీఎస్ రవి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గెస్ట్ లకు ఏ ఇబ్బంది లేకుండా ఉండే ప్రశ్నలు మాత్రమే బాలయ్య అడుగుతారని, గెస్ట్ లకు ఇబ్బంది ఉండే ప్రశ్నలు తాను అడగను అని ముందే ఆహా యాజమాన్యానికి బాలయ్య చెప్పారని తెలిపారు.
బాలకృష్ణకు ఒకసారి చెప్పిన విషయం మళ్ళీ చెప్తే కోపం వస్తుందని అన్నారు. అలాగే చంద్రబాబుని కలిసినప్పుడు… షోలో ఏ ప్రశ్న అయినా అడగవచ్చు అని చెప్పారని లోకేష్ ఓటమి గురించి, ఫోటోల గురించి అడుగుతామని చెప్పినా ఆయన ఓకే అన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎపిసోడ్ షూటింగ్ దాదాపు ఆరు గంటలకు పైగా జరిగిందని పేర్కొన్నారు. ఇక ఈ షో మూడో సీజన్ మే తర్వాత రానుంది.