ఒక భాషలో సినిమా హిట్ అయితే దాన్ని మరో భాషలో రీమేక్ చేస్తారు దర్శకులు. అలా చేసి మంచి హిట్ లు కొడతారు. మన తెలుగు సినిమాలను తమిళంలో బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసారు కొందరు దర్శకులు. ఈ సినిమాల్లో కొన్ని మంచి హిట్ లు ఇవ్వగా కొన్ని ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఆ దర్శకులు ఎవరు అనేది ఒకసారి చూద్దాం.
ప్రభుదేవా
తెలుగులో వచ్చిన పోకిరి సినిమాను బాలీవుడ్ లో వాంటెడ్ గా చేసి సూపర్ హిట్ కొట్టాడు. తమిళ్ లో విజయ్ తో రీమేక్ చేసి కూడా హిట్ అందుకున్నాడు. విక్రమార్కుడు సినిమాను అక్షయ్ కుమార్ హీరోగా రౌడీ రాథోడ్ గా చేసి హిట్ కొట్టాడు.
మోహన్ రాజా
తెలుగులో సూపర్ హిట్ అయిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాను తమిళంలో చేసాడు. అక్కడ తన తమ్ముడు జయం రవిని హీరోగా పెట్టి చేయగా సూపర్ హిట్ అయింది.
భీమినేని శ్రీనివాసరావు
ఈయన కూడా అప్పట్లో కొన్ని రీమేక్ లు చేసి సక్సెస్ కొట్టారు. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన సుస్వాగతం, వెంకటేష్ హీరోగా చేసిన సూర్య వంశం వంటి సినిమాలు మంచి హిట్ లు అందుకున్నాయి.