గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కడుపునొప్పితో హాస్పిటల్ లో చేరిన ఓ వ్యక్తి నిండు ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారు డాక్టర్టు. కులం, మతం, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ మొక్కే దేవుడు ఎవరైనా ఉన్నారంటే.. అది డాక్టర్ ఒక్కడే.. అలాంటి డాక్టర్ లే బాధ్యతారహితంగా వ్యవహరిస్తే.. ఏంటి పరిస్థితి..తాజాగా అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది.
కడుపునొప్పి కారణంతో కోటేశ్వరరావు అనే వ్యక్తిని నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడంతో.. డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించారు.
ఇంత వరకు బాగానే ఉంది.. కానీ.. సీన్ కట్ చేస్తే.. సదరు వ్యక్తి మృతదేహమై బయటకు వచ్చాడు.. అదేంది అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది ట్విస్ట్.. ఆపరేషన్ చేసిన డాక్టర్లు రోగి కడుపులో క్లప్ మరిచిపోయారు. ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా కడుపునొప్పి తగ్గక పోవడంతో.. డాక్టర్ ను నిలదీశారు కుటుంబ సభ్యులు.
పరీక్షించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు గుంటూరుకు తరలించారు. అప్పటికే సదరు వ్యక్తి మృతి చెందాడు. పరీక్షించిన డాక్టర్లు పేషేంట్ కడుపులో క్లప్ ఉండటం కారణంగానే వ్యక్తి చనిపోయినట్టు నిర్ధారించారు.
మృతికి కారణం అయిన నరసరావుపేట హాస్పిటల్ ముందు మృత దేహంతో నిరసనకు దిగారు కుటుంబ సభ్యులు. తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్యం, సదరు డాక్టర్ పై చర్యలు తీసుకోవాలంటూ మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ ఉధ్రిక్త వాతావరణం నెలకొంది.