ఆరంభంలో భారీ నష్టాల్లో ప్రారంభమైన దేశీయ సూచీలు కాస్త కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 400 పాయింట్ల నష్టంతో 59,070 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు కోల్పోయి.. 17,630 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్ షేర్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి.
ఐటీ, లోహ, ఫార్మా, రియాల్టీ స్టాక్స్ లో అమ్మకాలపై ఒత్తిడి కనిపిస్తోంది. ఇటు అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు వినిపిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలోనూ భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు కుప్పకూలాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 750 పాయింట్లు క్షీణించి.. 58,700 ఎగువన ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 228 పాయింట్లు కోల్పోయి.. 17,520 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు హెచ్యూఎల్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, బీపీసీఎల్, ఎన్టీపీసీ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్, ఇన్ఫోసిస్, దివీస్ ల్యాబ్స్ భారీగా పతనమయ్యాయి.