భూకంపం ఈ పేరు వింటేనే జంకు పుడుతోంది. టర్కీ,సిరియాలోని భూకంపం దృశ్యాలను చూసిన తరువాత దాని పేరు తలుచుకుంటేనే గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అలాంటిది ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భూమి కంపించడం ఇప్పుడు భయాందోళనను కల్గిస్తోంది.
ఉదయం 7.13 నిమిషాలకు.. 3,4 సెకన్ల పాటు భూమి ఇక్కడ కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు గురైన గ్రామవాసులు.. ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు.
మరో వైపు టర్కీ,సిరియాలో భూకంపం విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో.. భారత దేశంలో కూడా భూకంప ఛాయలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో నందిగామలో భూమి కంపించడం పై స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
భూకంపానికి సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే.. శాస్త్రవేత్తలు ముందుగానే తెలియజేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఇలా ఉంటే..ఉత్తర భారత దేశంలోనూ.. భూకంపనలకు అవకాశం ఉందన్న వార్తలు ఆందోళనను కల్గిస్తున్నాయి.